• Login / Register
  • NATIONAL NEWS | భారీగా పెరిగిన వంటనూనెల ధరలు

    పండగల వేళ సామాన్యులకు బిగ్ షాక్


    HYDERABAD |గత కొన్ని నెలలుగా దేశీయంగా వంటనూనెల ధరలు భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రస్తుతం పండగల సమయంలో సామాన్యులపై మరో భారం పడింది. ఒక్క నెల రోజుల్లోనే 37 శాతం పామాయిల్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. అదే సమయంలో ఆవనూనె ధరలు 29 శాతం పెరిగాయి. ఇక సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠ స్థాయి 5.5 శాతానికి చేరిన సమయంలో చమురు ధరల్లో పెరుగుదల వచ్చింది. పామాయిల్ ధరలు 37 శాతం, ఆవనూనె 29శాతం, సోయాబీన్ నూనె 23 శాతం, సన్‌ఫ్లవర్ 23 శాతం, పల్లి నూనె 4 శాతం పెరిగాయి. అలాగే పామాయిల్ ధరలు ఒక్కసారిగా 37 శాతం పెరగడంతో స్నాక్స్ తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల్లో కూడా ధరలు పెరిగాయి. అదే సమయంలో గ్రుహ అవ‌స‌రాల‌కు  ఉపయోగించే ఆవనూనె ధరలు కూడా అమాంతం 29శాతానికి పెరిగిపోయాయి. సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ట స్థాయి 5.5శాతానికి చేరగా.. చమురు ధరలు కూడా పెరిగాయి. కూరగాయలు, ఆహార పదార్థాల ధరల పెరుగుదల వ‌ల్ల‌  ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ముడి సోయాబీన్, పామ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ధరలు పెరిగాయి. 
    ఇక ఈ ముడి ఆయిల్‌పై పెంపుదల సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముడి పామ్ ఆయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెచింది. శుద్ధి చేసిన ఆహార నూనెపై 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచారు. ఇవి దేశంలోకి దిగుమతి అవుతున్న వంటనూనెల్లో ప్రధాన భాగం కావడంతో ప్రభావం పడింది. గత నెలలో ముడి పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్.. ప్రపంచ వ్యాప్తంగా వరుసగా దాదాపు 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం పెరిగాయని అధికారులు తెలిపారు. ఇక మన దేశం కావాల్సిన వంటనూనెల డిమాండ్‌లో 58శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.
    ఈ నేపథ్యంలోనే దేశీయంగానే నూనె గింజలను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నూనె గింజల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు వాటిని పండించే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ సర్దుబాట్లు అక్టోబరు నుంచి కొత్త సోయాబీన్, వేరుశెనగ పంటలు మార్కెట్‌లోకి రానున్నాయని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే దేశంలోని రైతులు పండించిన నూనె గింజలకు మంచి ధర లభించేలా చూడాలంటే ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలను అలాగే కొనసాగించడం అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రధాన వంట నూనెల ఆయిల్స్ ధరలు భారీగా పెరగడంతో అన్ని వంట నూనెల ధరలను ప్రభావితం చేస్తోంది.
    ***

    Leave A Comment